Posani Krishna Murali: బ్రాహ్మణికి పోసాని నాలుగు ప్రశ్నలు.. వాటికి సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా

బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అంటూ పోసాని అన్నారు. బ్రాహ్మణిని నేను నాలుగు ప్రశ్నలు అడుగుతా.. ఆమె వాటికి సమాధానం చెప్పాలని పోసాని కోరారు.

Posani Krishna Murali: బ్రాహ్మణికి పోసాని నాలుగు ప్రశ్నలు.. వాటికి సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా

Posani Krishna Murali and Nara Brahmani

Updated On : September 19, 2023 / 3:56 PM IST

YCP Leader Posani Krishna Murali: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (skill development Case) లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై ఏపీఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజలకోసమే అంటే ఎలాఅంటూ చంద్రబాబును విమర్శించారు. టీడీపీ హయాంలో జగన్ దగ్గర నుంచి 23మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు.. 23మంది ఎమ్మెల్యేలను డబ్బిచ్చికొన్నది కూడా ప్రజల కోసమేనా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అవినీతి పనులు చేస్తే జైల్లోనే పెడతారు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా.. జైల్లో ఉండి ర్యాలీలు, ధర్నాలతో నీకేం పని చంద్రబాబు అంటూ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Janasena Party: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరోసారి అదే గుర్తు

అనేక సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నావ్.. దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు లేవు. చంద్రబాబు అవినీతిపరుడని మోదీనే చెప్పారు. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. కానీ, నువ్వేమో మోదీని పర్సనల్‌గా తిట్టావు. ఇప్పటికైన చంద్రబాబు చేసిన తప్పులను ఒప్పుకోవాలంటూ పోసాని సూచించారు. చంద్రబాబు ఏడాదిపాటు జైలులో ఉండి బయటకు వచ్చేటప్పుడు నిజాయితీగా వస్తే మాకు అభ్యంతరం లేదని పోసాని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబుకు ఏసీ లేదని టీడీపీ నేతలు బాధపడుతున్నారు.. చంద్రబాబుకు దోమలు కరుస్తుంటే దోమల మందును, ఏసీలను, దోమల తెరలను నేను కొనిస్తా.. ఇచ్చిరండి అటూ పోసాని ఎద్దేవా చేశారు.

Read Also: Nara Brahmani : వైసీపీ అసమర్థ పాలన, నిజాన్ని కూడా చూడలేని కపోదులు : నారా బ్రాహ్మణి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి మాటలు విని నవ్వుకోవాలంటూ పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు.  బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అంటూ పోసాని అన్నారు. బ్రాహ్మణిని నేను నాలుగు ప్రశ్నలు అడుగుతా.. ఆమె వాటికి సమాధానం చెప్పాలని పోసాని కోరారు.. 1. మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు? 2. మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు? 3. మీ తాతయ్యను చంపిందెవరు? 4. జగన్ దగ్గర నుంచి 23మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు? అంటూ పోసాని ప్రశ్నించారు. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే బ్రాహ్మణి కాళ్లకు దండం పెడతా అంటూ పోసాని కృష్ణమురళీ పేర్కొన్నారు.