రేపటి నుంచే : APలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు 

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 10:58 AM IST
రేపటి నుంచే : APలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు 

Updated On : December 10, 2019 / 10:58 AM IST

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు, ఇంద్ర, ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. వెన్నెల, స్లీపర్‌ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు.

పల్లె వెలుగులో మొదటి 2 స్టేజీలు/10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ. 5 ఛార్జీ పెంచినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. కాగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అనంతరం చార్జీలు పెరిగిన విషయం తెలిసిందే.