Atchennaidu On Early Elections : ముందస్తు వచ్చే అవకాశం, 160 సీట్లు గెలుస్తాం-అచ్చెన్నాయుడు
జగన్ పాలనపై ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. మహానాడు విజయవంతం కావడమే దానికి సంకేతం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే.

Atchannaidu slams AP police
Atchennaidu On Early Elections : జగన్ మూడేళ్ల పాలనపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నంలోని టీడీపీ ఆఫీస్ లో మీడియా సమావేశంలో.. వైసీపీ మూడేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.
”డైవర్షన్ ముఖ్యమంత్రి జగన్. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను చంపిన అంశం డైవర్షన్ చెయ్యడానికి అల్లర్లు సృష్టించారు. రాజధాని ప్రాంతంలో కుల ఘర్షణలు రెచ్చగొట్టారు. సొంత బాబాయ్ హత్యలో బాంబులేస్తామని సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారు. ఇకపై రోజుకు ఒక్క విషయంపై మా నాయకులు పోరాడతారు. రెవెన్యూ మంత్రి అయ్యిండి.. మీకు డబ్బులిస్తున్నాము మిగిలిన వాటి గురించి మీకెందుకు? అని ప్రజలను ప్రశ్నించడం ఏమిటి?
మా ప్రభుత్వంలో 57 శాతం సంక్షేమ పథకాలను అమలు చేశాము. మరి మీరు కేవలం 47 శాతం ఖర్చు పెడుతూ సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదు. మహానాడు విజయవంతం కావడమే దానికి సంకేతం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధం. 160 సీట్లు గెలుస్తాం. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తాం.
రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండే స్పీకర్ లాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం తగదు. ఇలాంటి వ్యక్తి స్పీకర్ గా ఉండటం జిల్లాకే అవమానం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి.. అందులోనూ తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం పొందిన వ్యక్తి మహానాడును వల్లకాడు అనడం అవివేకం. ప్రజలు ఆయనను అక్కడికే పంపుతారు. మహానటుడు ఎన్టీఆర్ కు.. దొంగల ముఠా నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి పోలికా? ఎన్టీఆర్ కు భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇకపైనా చేస్తాము” అని అచ్చెన్నాయుడు అన్నారు.
Chandrababu On Mahanadu : మహానాడు సక్సెస్ అయిందన్న చంద్రబాబు, దూకుడు పెంచాలని పిలుపు