Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

Nara Lokesh : ఈ ఘటనతో స్థానికంగా కొంత ఉద్రికత్త నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Attack On Nara Lokesh : యువగళం పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ కి చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో లోకేశ్ పై ఓ కోడిగుడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నాయకులు కోడిగుడ్లు విసిరిన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లోకేశ్ పై గుడ్ల దాడితో అక్కడ హైటెన్షన్ నెలకొంది. గుడ్లు విసిరిన వారిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని చితక్కొట్టారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కొంత ఉద్రికత్త నెలకొంది. అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రొద్దుటూరులో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే లోకేశ్ పై దాడి జరిగింది. ఇద్దరు యువకులు లోకేశ్ పై కోడిగుడ్లు, రాయి విసిరారు. ఊహించని ఈ పరిణామంతో అంతా షాక్ అయ్యారు. యువకుల చర్యతో టీడీపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు.(Nara Lokesh)

Also Read..CM Jagan : చంద్రబాబుకు కాపీ కొట్టటం తప్ప ఒరిజినల్టీ తెలియదు, కర్ణాటక, వైయస్సార్ పథకాలన్నీ పులిహోర కలిపి మేనిఫెస్టోగా ప్రకటించేశారు

కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వెంటనే వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని చితకబాదారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినా టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆ యువకులను అక్కడి నుంచి వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరక్కుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆ ఇద్దరు యువకులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే, తాము దాడి చేయలేదని, లోకేశ్ పాదయాత్ర చూడటానికి వచ్చామని ఆ ఇద్దరు యువకులు వాదిస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు కోడిగుడ్లు విసరడం తాము చూసి పట్టుకున్నామని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇద్దరు యువకులను వారు చితక్కొట్టారు. ఈ దాడి చేయాలని ఏ పార్టీ వారు చెప్పారు? మీకు ఎంత డబ్బు ఇచ్చారు? అని ఆ యువకులను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అయితే, ఇది ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Also Read..Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్ లో వరుస ప్రమాదాలు.. ఘాట్ రోడ్ల విషయంలో టీటీడీ ఏం చేయాల్సి ఉంది!

టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేస్తామని ఘటనా స్థలంలోనే టీడీపీ నేతలకు పోలీసులు హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేలా చేయొద్దని టీడీపీ నేతలను పోలీసులు కోరారు. ఇది ఆకతాయిల చర్యగానే చూడాలని, పార్టీల మధ్య జరిగిన వివాదంగా చూడొద్దని టీడీపీ నాయకులకు సర్ది చెప్పారు పోలీసులు. దాడికి పాల్పడింది వాళ్లే అని తేలితే కచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు