CM Jagan : చంద్రబాబుకు కాపీ కొట్టటం తప్ప ఒరిజినల్టీ తెలియదు, కర్ణాటక, వైయస్సార్ పథకాలన్నీ పులిహోర కలిపి మేనిఫెస్టోగా ప్రకటించేశారు

చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారు..దాని పేరు మహానాడు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.

CM Jagan : చంద్రబాబుకు కాపీ కొట్టటం తప్ప ఒరిజినల్టీ తెలియదు, కర్ణాటక, వైయస్సార్ పథకాలన్నీ పులిహోర కలిపి మేనిఫెస్టోగా ప్రకటించేశారు

chandrababu .. YS Jagan

CM Jagan Kurnool Tour : కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతు..టీడీపీపైనా మహానాడులో ప్రకటించిన టీడీపీ మ్యానిఫెస్టోపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. రైతుకు చంద్రబాబు శత్రువు అంటూ విమర్శలు సంధించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రాజమండ్రిలో ఒక స్టోర్ డ్రామా క్రియేట్ చేశారని దాని పేరు మహానాడు అంటూ సెటైర్లు వేశారు. మహానాడులో చంద్రబాబు డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించిందని.. తానే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని కీర్తిస్తూ ఫోటో దండ వేశారంటూ విమర్శించారు. మహానాడులో మేనిఫెస్టోను ఆకర్షణమైన మేనిఫెస్టోగా ప్రకటించారని..చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే మేనిఫెస్టో పేరుతో వేషం వేస్తున్నాడు అంటూ విమర్శించారు.

 

చంద్రబాబు సత్యం పలకడు, మాట మీద నిలబడడు, విలువలు,విశ్వనీయత అసలే ఉండవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు అయినా సరే పొడుస్తాడు..ఎన్నికల అయిపోయిన తర్వాత ప్రజలనైనా సరే పొడుస్తాడు..అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనకాడడు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు మేనిఫెస్టో గురించి చంద్రబాబుకి తెలుసా? చంద్రబాబు మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టింది, మన పథకాలన్నీ కాపీ కొట్టేసి పులిహోర కలిపేసి తన మ్యానిఫోస్టోగా ప్రకటించేసి ప్రజల్ని మళ్లీ మోసం చేద్దామని ఎత్తులు వేస్తున్నాడంటూ విమర్శించారు.

Prasad V Potluri : ఏందయ్యా కేశినేని నానీ.. నీ బిల్డప్, వెధవ సోది ఆపు : వైసీపీ నేత PVP సెటైర్లు

వైయస్సార్ పథకాలన్నీ కాపీ చేసి.. కాంగ్రెస్,బీజేపీ పథకాలు కాపీ, చివరికి బాబు బతికే కాపీ మోసం, బాబుకు ఒరిజినల్టి తెలియదంటూ దుయ్యబట్టారు. ఈ పెద్దమనిషికి 175 నియోజకవర్గాలలో 175 మంది కాండేట్లు దొరకని పార్టీ పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఏ గడ్డైనా తినడానికి వెనకాడని పార్టీ చంద్రబాబు అని.. విలువలు లేవు విశ్వనీయత లేని పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు, యువకులు, ఇది చేశానని చెప్పుకునేందుకు చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.

 

నమ్మిన రైతుల్ని,నమ్మిన యువతని, నమ్మిన అవ్వ తాతలని, పొదుపు మహిళల్ని మోసం చేశారంటూ వివర్శలు సంధించారు. ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు కొంగ జపం మొదలుపెట్టారంటూ చురకలు వేశారు. ఇది కురుక్షేత్ర యుద్ధం పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు.