మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసు…TDP నేతలకు బిగుస్తోన్న ఉచ్చు

  • Published By: bheemraj ,Published On : December 2, 2020 / 12:59 PM IST
మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసు…TDP నేతలకు బిగుస్తోన్న ఉచ్చు

Updated On : December 2, 2020 / 1:08 PM IST

Attempt murder against Minister Perninani : మచిలీపట్నం MLA, మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో స్థానిక TDP నేతలకు ఉచ్చు బిగుస్తోంది. నిందితుడు నాగేశ్వరరావు కాల్ లిస్ట్ ఆధారంగా విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమంది TDP నేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



https://10tv.in/major-political-parties-focus-on-tirupati-lok-sabha-by-election/
మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మరకాని పరబ్రహ్మం, TDP నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్, శివను స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మరికొందరు TDP నేతలను స్టేషన్‌కు పిలిపించే అవకాశం ఉంది. నాగేశ్వరావుకు TDP నేతలతో ఎక్కువగా పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.



మరోవైపు మంత్రి పేర్నినానిపై కావాలనే నిందితుడు హత్యాయత్నం చేసినట్లు తమ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో ఎలాంటి భయం లేకుండా నాగేశ్వరరావు సమాధానం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.



ఇప్పటికే ఐదు ప్రత్యేక బృందాలతో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు.. నాగేశ్వరరావు సోదరిని పూర్తి స్థాయిలో మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నిన్న నాగేశ్వరరావుకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్న పోలీసులు..ఈ రోజు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.