Anantapur : అత్త తిట్టిందని కోడలు ఆత్మహత్యాయత్నం

అత్త సూటిపోటి మాటలు భరించలేని కోడలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Anantapur : అత్త తిట్టిందని కోడలు ఆత్మహత్యాయత్నం

Anantapur (2)

Updated On : November 8, 2021 / 8:19 PM IST

Anantapur : అత్త సూటిపోటి మాటలు భరించలేని కోడలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మున్ననగర్ కు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పోతులయ్యా, బోయ లక్ష్మి భార్యాభర్తలు వీరికి 12 ఏళ్ళక్రితం వివాహం జరిగింది. ఈ నెల 6న అత్త ఈశ్వరమ్మ కోడలు లక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది.

చదవండి : Anantapur : కొడుకు పెళ్ళైన కొద్ది నిమిషాలకే తండ్రి మృతి

కోడలు తనను సరిగా చూసుకోవడం లేదని, తనకు సమయానికి అన్నం పెట్టడం లేదని కొడుకు పోతులయ్యకి చెప్పి కోడలిని దూషించింది. అయితే ఇదే సమయంలో పోతులయ్యా బయటకు వెళ్ళాడు.. ఇదే సమయంలో లక్ష్మి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే ఈశ్వరమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అక్కడ ప్రథమ చికిత్స చేయించి జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కాలిన గాయాలు అధికంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌‌లు దర్యాప్తు చేపట్టారు.