నన్ను చంపడానికి అఖిలప్రియ ప్రయత్నించింది : ఏవీ సుబ్బారెడ్డి

  • Published By: bheemraj ,Published On : June 5, 2020 / 06:33 PM IST
నన్ను చంపడానికి అఖిలప్రియ ప్రయత్నించింది : ఏవీ సుబ్బారెడ్డి

Updated On : June 5, 2020 / 6:33 PM IST

ఆళ్లగడ్డ రాజకీయ హీటెక్కుతోంది. టీడీపీ నేత అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భూమా అఖిల ప్రియ ఆమె భర్తతో కలిసి తనను చంపేందుకు కుట్ర పన్నారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తనను చంపడానికి అఖిలప్రియ ప్రయత్నించిందన్నారు. 

తనకు రక్షణ కల్పించాలని ఏవీ సుబ్బారెడ్డి కోరారు. కర్నూలు ఎస్ పీతో మాట్లాడాను…పోలీస్ రక్షణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. అఖిలప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిందని విమర్శించారు. వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరారు. భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉండే వారు. ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియం సీరియస్ అయ్యారు.

దీనిపై స్పందించిన అఖిల ప్రియ తనను అరెస్టు చేయాలన్న ఏబీ సుబ్బారెడ్డి మాటల వెనుకాల ఉన్న ఉద్దేశమేంటో అర్థం కావడం లేదన్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. చేతనైతే ఆళ్లగడ్డ వచ్చి రాజకీయం చేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు సహకరిస్తామని తెలిపారు. 

Read: పోర్టల్ నుంచి ఇసుక బల్క్ ఆర్డర్లను తొలగించాలి : సీఎం జగన్