అసలు ఇక్కడ ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు: బాలినేని శ్రీనివాసరెడ్డి

ప్రస్తుతం బీజేపీతో టీడీపీ చేతులు కలిపింది కాబట్టి అధికారులంతా ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు.

అసలు ఇక్కడ ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు: బాలినేని శ్రీనివాసరెడ్డి

MLA Balineni Srinivasa Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో జరిగిన ఘర్షణపై ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతో తాను ఒంగోలు వన్ టౌన్ పీఎస్‌కు వచ్చానని చెప్పారు. ఇందులో తన పేరునూ చేర్చారు కాబట్టి తనను కూడా అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశానని తెలిపారు.

అసలు ఇక్కడ ఏమి జరుగుతుందో తమకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ముందుగా 41 నోటీసులు ఇచ్చి వివరణ కోరాల్సిన పోలీసులు పోలీసులు అదేమి చేయలేదని అన్నారు. అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు పెట్టాలని భావిస్తున్న పోలీసుల తీరు సరికాదని చెప్పారు. దీనిపై తాను అవసరమైతే హైకోర్టుకు వెళతానని అన్నారు.

ఎస్పీని మార్చి పంపించేశారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీతో టీడీపీ చేతులు కలిపింది కాబట్టి అధికారులంతా ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు. మొదట సమతా నగర్‌లో జరిగిన ఘటనలో ప్రచార నిమిత్తం వెల్లిన తమ కోడలిపై దుర్భాషలాడారని చెప్పారు. దీంతో ఆ మాటలు విన్నాక ఈ రాజకీయాల్లో కొనసాగడం అవసరమా అనిపిస్తోందని తెలిపారు.

తాను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తినని చెప్పారు. ఎస్పీ స్పందించకపోతే ఇంటికెళ్లి కొడతానంటూ ఆ కార్యాలయం ముందు టీడీపీ జనార్దన్ ధర్నాకు దిగుతున్నారని అన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద దర్నా చేస్తే వారిపై కేసులు పెట్టలేదని చెప్పారు. అధికారులు తమను వేధిస్తున్నారని అన్నారు.

Also Read: నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి