Annadata Sukhibhava Scheme
Annadata Sukhibhava : ఒకవైపు.. పీఎం కిసాన్ రూ. 2వేలు.. మరోవైపు అన్నదాత సుఖీభవ డబ్బులు రూ. 5వేల కోసం ఏపీ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు కలిపి ఒకేసారి లబ్ధిదారు రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 7వేలు జమ కానున్నాయి. అయితే, చాలామంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ కొంతమంది ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి, అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
అలాగే, పీఎం కిసాన్ పథకం డబ్బులు (Annadata Sukhibhava) కూడా నేరుగా అదే రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ కానున్నాయి. ఒకవేళ అర్హులైన ఏపీ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ రూ. 2వేలు పడినప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం తాలుకూ డబ్బులు పడకపోతే ఆందోళన పడొద్దు.
ఎందుకంటే.. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత ఫండ్స్ ప్రభుత్వం విడుదల చేయనుంది. కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ రెండో విడత ద్వారా మొత్తం రాష్ట్రంలోని 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
ఈ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతులకు సాంకేతిక లోపాల కారణంగా వారి అకౌంట్లలో డబ్బులు జమ అవ్వడం లేదు. ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పిస్తోంది. ఏపీ రైతుల్లో ఎవరైనా తమకు నిధులు అందకపోతే వివరాలను సరిచేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
అప్పుడే పథకం ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిసుందని గమనించాలి. అంతేకాదు.. వెబ్‌ల్యాండ్‌లో రైతు ఆధార్ నంబర్ తప్పుగా రిజిస్టర్ అయితే కూడా డబ్బులు అకౌంటులో జమ కావు. లబ్ధిదారు రైతులు వెంటనే రెవెన్యూ అధికారులను సంప్రదించి తప్పుగా పడిన వివరాలను సరిచేయించుకోవాలి.
ఒకవేళ అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ పథకం వారికి వర్తిస్తుంది. NPCAలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న అకౌంట్లను యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. రైతు పేరు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో లేనట్టయితే.. వ్యవసాయ కేంద్రాల్లోని సహాయకులను సంప్రదించాలి. అక్కడ రైతులు తమ వివరాలు సమర్పించాలి. ఈకేవైసీ పూర్తి కాకపోవడం, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ చేయకపోవడం, కొందరి బ్యాంకు అకౌంట్లు ఇన్ యాక్టివ్ ఉండటం వంటివ కారణాల వల్ల కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు పడవు.
ఈ అన్నదాత సుఖీభవ పథకం ప్రకారం.. డబ్బులు రైతులకు నేరుగా అకౌంట్లలో జమ కావాలి. అయితే, కొన్ని సందర్భాలలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు పడవు. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం సమయానుకూలంగా సాయం అందించలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
1. పథకం రిజిస్ట్రేషన్ చెక్ చేయండి :
మీ పేరు పథకంలో రిజిస్టర్డ్ అయిందో లేదో అధికారిక వెబ్‌సైట్ లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయ ద్వారా చెక్ చేసుకోండి.
2. పథకం హెల్ప్ సెంటర్ సంప్రదించండి :
పంట కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు వద్ద మీ సమస్యను తెలియజేయవచ్చు. అక్కడి అధికారులు మీకు కొన్ని మార్గాలను సూచిస్తారు. మీ గ్రామ పంచాయతీ, రైతు సంఘం లేదా స్థానిక పంట కొనుగోలు సంఘం నుంచి సంబంధిత సాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందకపోతే, సంబంధిత అధికారులు లేదా గ్రామ పంచాయతీకి లేదా రైతు సంఘాలకు దరఖాస్తు చేసుకుని తద్వారా పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
Read Also : AP Govt : ఏపీలో రైతుల ఖాతాల్లో రూ.7వేలు.. వీరికి మాత్రం డబ్బులు పడవు.. ఎందుకంటే?
మీరు అర్హులా? కాదా? ఇలా చెక్ చేసుకోండి :