AP Govt : ఏపీలో రైతుల ఖాతాల్లో రూ.7వేలు.. వీరికి మాత్రం డబ్బులు పడవు.. ఎందుకంటే?
AP Govt : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి.
AP Govt : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ (Annadata sukhibhava) – పీఎం కిసాన్ (PM Kisan) పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. పీఎం కిసాన్ 21వ విడత సొమ్ము రూ.2వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేయనుండగా.. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7వేల నగదు జమకానుంది.
కోయంబత్తూరులో పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అన్నదాత సుఖీభవ పథకం నగదును విడుదల చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ.972.09 కోట్లు ఉంటుంది.
అయితే, నెలకు రూ.20వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు.
Also Read: Encounter : మావోయిస్టులకు మరో బిగ్‌షాక్.. ఏవోబీలో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
