విజయవాడలో సంచలన దోపిడి.. ఏడు కిలోల బంగారు నగలు, రూ.42లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు.

పట్టపగలు విజయవాడలో నగల దోపిడి సంచనలం రేపింది. వన్‌టౌన్‌లో సాయిచరణ్ జ్యువెలరీ షాపులో ఏకంగా ఏడు కిలోల బంగారాన్ని, రూ. 42 లక్షల డబ్బును ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ అంతా సినిమా స్టైల్లో సాగింది. బెజవాడ కాటూరివారి వీధిలో మిట్టమధ్యాహ్నం దోపిడీ స్థానికంగా కలకలం రేగింది.
సాయిచర్ జ్యువెల్లరి షాపుకు చెందిన బంగారాన్ని ఒక ఇంటిలో భద్రపరచి…అవసరమైనప్పుడు తీసుకెళ్తుంటారు.
ఈరోజు ఆ బంగారాన్ని తీసుకొని షాపు దగ్గరకు వచ్చారు. అప్పటికే అక్కడ మాటువేసిన దొంగలు…షాపు తెరవగానే లోపలికి వచ్చారు. గుమస్తాపై బ్లేడ్లతో దాడిచేశారు. బంగారాన్ని, డబ్బును ఎత్తుకెళ్లిన దొంగలు, వెండి నగలను అస్సలు ముట్టుకోలేదు. గుమస్తాను తాళ్లకట్టేసి అక్కడనుంచి దొంగలు మాయమైయ్యారు. వెళ్తూ షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు.కొన్నిచోట్ల రక్తపు మరకలున్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వెనుకవైపునే జ్యువెలరీ షాపుంది. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కీలక సాక్షి గుమస్తా గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు.వెంటనే పోలీసలు దర్యాప్తు మొదలెట్టారు. చుట్టుపక్కల సిసీ కెమేరా విజువల్స్ ను పరిశీలిస్తున్నారు. క్లూస్ సేకరిస్తున్నారు. కొన్ని ఆధారాలుదొరికాయి.
అసలు పట్టపగలు బంగారు నగల దోపిడికి చెసిందెవరు? పోలీసులు మాత్రం గుమస్తానే అనుమానిస్తున్నారు. అతన్ని విచారిస్తేనే అసలు సంగతి బయటకొస్తుంది. ప్రస్తుతానికి నగల దోపిడి చిక్కుముడిలా ఉన్నా….త్వరలోనే అన్ని ఆధారాలను సేకరిస్తామని అంటున్నారు విజయవాడ డిసిపీ విక్రాంత్ పాటిల్..