Balineni Srinivasa Reddy Resign : వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా బాలినేని ప్రకటించారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నాను అని బాలినేని చెప్పుకొచ్చారు.
గత కొంత కాలం వైసీపీ అధిష్టానం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు బాలినేని శ్రీనివాస రెడ్డి. ఆయన వైసీపీని వీడనున్నారు అనే వార్తలు జోరుగా వినిపించాయి. చివరకు బాలినేని వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో పలు కారణాలు తెలిపారు బాలినేని. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను లేఖలో పేర్కొన్నారు బాలినేని. జగన్ ప్రభుత్వంలో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి కూడా బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
Also Read : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం
పలు దఫాలుగా తన అసంతృప్తిని జగన్ దృష్టికి తీసుకెళ్లారు బాలినేని. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా తాను అనేక అవమానాలకు గురయ్యాయని బాలినేని వాపోయారు. ఇప్పటివరకు తనకు జరిగిన అవమానాలు ఇక చాలని, పార్టీలో తానిక కొనసాగలేనని బాలినేని డిసైడ్ అయ్యారు. కాగా, బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి ఆయనతో పలు మార్లు చర్చలు జరిపారు. బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే, బాలినేని వెనక్కి తగ్గలేదు. వైసీపీకి రాజీనామా చేసేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని.. జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది. రేపు పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.