CI Swarnalatha Case : సీఐ స్వర్ణలత కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

CI Swarnalatha Case : నోట్ల మార్పిడి పేరుతో స్వర్ణలత అండ్ గ్యాంగ్ నేవీ అధికారులను బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

CI Swarnalatha Case : సీఐ స్వర్ణలత కేసులో బిగ్ ట్విస్ట్, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

CI Swarnalatha Case

Updated On : July 12, 2023 / 7:25 PM IST

Vizag CI Swarnalatha : విశాఖ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రూ.12లక్షలే తీసుకొచ్చినట్లు ఉంది. అసలైతే నేవీ అధికారుల నుంచి తీసుకొచ్చింది 90లక్షలు అని తెలుస్తోంది.

Also Read..Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నోట్ల మార్పిడి పేరుతో స్వర్ణలత అండ్ గ్యాంగ్ నేవీ అధికారులను బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని.. స్వర్ణలత, సూరిబాబు చెరో 5లక్షలు తీసుకున్నట్లు, హోంగార్డు శ్రీనివాసరావు రూ.2లక్షలు తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అసలు 90లక్షలు ఎవరివి? ఎక్కడివి? అనే ఉత్కంఠ నెలకొంది.

విశాఖపట్నంలో 2వేల రూపాయల నోట్ల మార్పిడి కేసులో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయ్యారు. రూ.90 లక్షల విలువైన రూ.2వేల నోట్లతో పట్టుబడిన వ్యక్తిని బెదిరించి రూ.12 లక్షలు లాక్కున్న ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీతమ్మధార ప్రాంతంలో రాత్రిపూట విధుల్లో ఉన్న స్వర్ణలత బృందానికి సూరిబాబు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు తీసుకెళ్తూ దొరికాడు.

Also Read..Khiladi Lady Rasheeda : అటువంటి మగవాళ్లే టార్గెట్, నాలుగు రాష్ట్రాల్లో 8 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

సూరిబాబును బెదిరించిన సీఐ అతడి నుంచి రూ.12 లక్షల విలువైన నోట్లు తీసుకుని విడిచిపెట్టారు. ఈ ఘటనపై నౌకాదళ సిబ్బంది కొల్లి శ్రీను, శ్రీధర్ విశాఖ సీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వర్ణలత డబ్బులు తీసుకున్నట్టు తేలింది. దీంతో ఆమెతోపాటు శ్యాంసుందర్ అలియాస్ మెహర్, శ్రీనుపైనా వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోట్ల మార్పిడికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుపైనా కేసు బుక్ చేశారు.

పట్టుబడిన డబ్బు గురించి ఐటీ వాళ్లకు, టాస్క్‌ఫోర్స్‌కు చెబితే కేసు అవుతుందని సీఐ స్వర్ణలత నేవీ ఉద్యోగులను భయపెట్టారు. ఎలాంటి కేసు లేకుండా ఉండాలంటే రూ.12లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాంతో భయపడిపోయిన నేవీ ఉద్యోగులు.. ఆమె అడిగిన మొత్తం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారికి ఎందుకో సూరిబాబుపై డౌట్ వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సీపీ విచారణ జరిపించగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సీఐతో పాటుగా మిగిలిన వారి ప్రమేయం ఉందని తేల్చారు.