Khiladi Lady Rasheeda : అటువంటి మగవాళ్లే టార్గెట్, నాలుగు రాష్ట్రాల్లో 8 పెళ్లిళ్లు చేసుకున్నయువతి..

సోషల్ మీడియాలో పరిచయం అవుతుంది. డబ్బున్న మగవాళ్లెవరో తెలుసుకుంటుంది. హాయ్ అంటుంది. ఆనక ప్రేమిస్తున్నానంటుంది. ఆ తరువాత ఇక పెళ్లే. పెళ్లి ముచ్చటకాస్తా అయ్యాక నెత్తిన టోపీ పెడుతుంది. డబ్బు, నగలతో ఉడాయిస్తుంది. అలా దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బున్న మగవారితో పరిచయాలు పెంచుకుని ఆనక చుక్కలు చూపిస్తోంది.

Khiladi Lady Rasheeda : అటువంటి మగవాళ్లే టార్గెట్, నాలుగు రాష్ట్రాల్లో 8 పెళ్లిళ్లు చేసుకున్నయువతి..

Khiladi Lady Rasheeda

Updated On : July 12, 2023 / 6:06 PM IST

Khiladi Lady Rasheeda : దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బులు దండిగా ఉన్న పురుష పుంగవులకు చుక్కలు చూపిస్తోంది ఓ లేడీ.. మాయలాడిలా మారి వలపు వలలు వేస్తూ నిలువెల్లా దోచేస్తోంది. అందంతోపాటు అలవిమీరిన తెలివితేటలతో డబ్బులున్న మగవారిని టార్గెట్ గా చేస్తుకుని ఏపీ, తెలగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో డబ్బున్న మగవారికి సోషల్ మీడియా వేదికగా గాలం వేస్తుంది. ఆ తరువాత ప్రేమ అంటుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. ఆ తరువాత వారం కూడా తిరక్కుండానే ఇంట్లో ఉన్నడబ్బులు, నగలతో ఉడాయిస్తుంది. అలా ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఎనిమిది మందిని వివాహం చేసుకుని ఇంట్లో డబ్బులు, నగలు పట్టుకుని పరారైన ‘రషీద’ (Rasheeda) అనే యువతిని పట్టుకోవటానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Andhra Pradesh : ఏపీలో టమాటా రైతు హత్య .. ఈ దారుణానికి కారణం అదేనా..?!

తమిళనాడు(tamilnadu)లోని సేలం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ (instagram)లో పరిచయం అయ్యింది. తరువాత ప్రేమ అంటూ ముగ్గులోకి దింపింది. ఏడాదిపాటు ప్రేమ అంటూ నమ్మించింది. తరువాత పెళ్లి చేసుకుందామంది. ఇంకేముంది.. అమ్మాయి అందంగా ఉంది. ఏడాది నుంచి ప్రేమ కబుర్లతో తెగ ముచ్చట్లు. ఇక ఆలోచించేదేముంది.. 2023 మార్చి 30న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే కనిపించకుండాపోయింది. ఆమెతో పాటు ఇంట్లో డబ్బు, నగలు కూడా మాయం అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రషీద కోసం వెదుకుతున్నారు. అలా ఒకరు ఇద్దరు కాదు ఎనిమిది మందిని సోషల్ మీడియా వేదికగా ముగ్గులోకి దింపి పెళ్లిళ్లు చేసుకుంది. ఆనక డబ్బు, నగలతో ఉడాయిస్తోంది.

Haryana : హనుమాన్ చాలీసా చదివి షాక్ ఇచ్చిన ఘనుడు .. వీడు మామూలోడు కాదు..

రషీద నీలగిరి జిల్లా (Nilgiri district)కు చెందిన యువతి అని గుర్తించిన పోలీసులు ఆమె కోసం వెదుకుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్స్ తో డబ్బున్న మగవారిని గుర్తించి వారితో స్నేహం పెంచుకుంటుంది. తరువాత ప్రేమిస్తున్నాంటుంది. ఆ తరువాత ఇక పెళ్లి పేరుతో అన్ని దోచేసి ఉడాయిస్తుంది.