Municipal Elections : కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది.

Kondapalli : మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అప్రతిహతంగా దూసుకపోతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన…కుప్పం నియోజకవర్గంలో వైసీపీ పాగా వేయడం విశేషం. అయితే.. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 13వార్డుల్లో టీడీపీ గెలవగా.. ఆరు వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కొండపల్లి మున్సిపాల్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి.

Read More : Achennaidu : మళ్లీ గెలిస్తే.. టీడీపీ ఆఫీసుకి తాళం వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలనం

29 వార్డులకు గాను..14 స్థానాల్లో వైసీపీ, 14 స్థానాల్లో టీడీపీ గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ వార్డు మెంబర్ శ్రీ లక్ష్మి గెలిచారు. అనూహ్యంగా..ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీ కండువా కప్పుకోవడంతో వైసీపీ నేతలకు షాక్ కు గురయ్యారు. టీడీపీ బలం 15కు చేరుకుంది. దీంతో ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారాయి. స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటుతో వైసీపీకి మరో ఓటు..పెరగడంతో 15 బలం చేరింది.

Read More : Telugu New Films: డిసెంబర్ రావడమే ఆలస్యం టాలీవుడ్ జాతర షురూ!

ఇక్కడ ఎంపీ కేశినేని నాని ఓటు కీలకంగా మారింద. ఈయన ఎవరికి ఓటు వేస్తే..ఆ పార్టీ గెలిచినట్టవుతుంది. 15 రోజుల క్రితమే..ఓటు రిజిష్టర్ చేసుకోవాలని కొండపల్లి మున్సిపల్ అధికారులకు నుంచి ఆయనకు సమాచారం అందించారు. కానీ..ఆయన స్పందించడం లేదని తెలుస్తోంది. మరి ఎంపీ నాని ఓటు చెల్లుతుందా ? లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు