Achennaidu : మళ్లీ గెలిస్తే.. టీడీపీ ఆఫీసుకి తాళం వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలనం

ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..

Achennaidu : మళ్లీ గెలిస్తే.. టీడీపీ ఆఫీసుకి తాళం వేస్తాం.. అచ్చెన్నాయుడు సంచలనం

Achennaidu

Achennaidu : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి తీసుకోవట్లేదని చెప్పారు. అక్కడ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రజల్లో మీకు విశ్వాసం ఉందని భావిస్తే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని, మళ్లీ వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయంకి తాళం వేస్తామని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

”దొంగ ఓట్ల మంత్రి పెద్దిరెడ్డి. డీజీపీ ఒక నిమిషం కూడా సీటులో ఉండకూడదు. ఈ ఎన్నికలతో ప్రజా మద్దతు టీడీపీ వైపు ఉందని స్పష్టమవుతోంది. ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. చంద్రబాబు పని అయిపోలేదు… కొద్దిరోజుల్లో మీకు అసలు సినిమా చూపిస్తారు. మంత్రి వెల్లంపల్లికి దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలిస్తే టీడీపీ పార్టీని మూసేస్తాం. ఒక వెల్లంపల్లి కాదు వైసీపీలో ఉన్న అందరూ రాజీనామాలు చేసి తిరిగి గెలిస్తే చాలు టీడీపీ పార్టీని మూసేస్తాం” అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.

Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

”7 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీకు 30శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని వైసీపీనే ప్రకటించింది. వైసీపీ లెక్కల ప్రకారమే చూస్తే 7 నెలలు తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకు 48శాతం ఓట్లు వచ్చాయి. అధికార పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత మున్సిపల్ ఎన్నికల్లో బయటపడింది. దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పంలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మొదటి రోజు నుంచి గమనించారు. సామ దాన దండోపాయాలు కుప్పంలో ప్రయోగించారు. కుప్పంలో గెలుపు.. ఓ గెలుపా? వైసీపీ విజయాన్ని డీజీపీకి అంకితం చేయాలి. డీజీపీ సహకారంతోనే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది” అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.