తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ…సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 09:27 PM IST
తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ…సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : December 12, 2020 / 9:37 PM IST

BJP candidate contesting in Tirupati Parliamentary elections : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరాట పడుతున్న జనసేన పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. తిరుపతి సభలో సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. శోభాయాత్రలో పాల్గొన్న సోము వీర్రాజు… తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కార్యకర్తలు కలిసి కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే… తిరుపతికి కేంద్రం మరిన్ని నిధులు మంజూరు చేస్తుందని సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తామని చెప్పారు.

బీజేపీ-జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాకముందే సోము వీర్రాజు ప్రకటన చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు ఆరాటపడుతున్నది. తిరుపతిలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన నేతలు పలుమార్లు ప్రకటించారు.