Madhav On Amalapuram Row : అట్టుడుకుతున్న అమలాపురం.. ఇది ప్రభుత్వం సృష్టించిన అనవసర వివాదమన్న బీజేపీ ఎమ్మెల్సీ
అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన అవనసరం వివాదం అని మండిపడ్డారు.
- Naveen
- Published On : May 24, 2022 / 08:41 PM IST
New Project
Madhav On Amalapuram Row : అమలాపురం అట్టుడుకుతోంది. కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గి రాజేసింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో అమలాపురం భగ్గుమంది. జిల్లా పేరు మార్పుని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగలబెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. దీనిపై మొదలైన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. అమలాపురంలో పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి వేలాది మంది రోడ్లపైకి వచ్చారు.
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన అవనసరం వివాదం అని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వైసీపీ ప్రభుత్వం వివాదంలోకి లాగిందని ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో వివాదం చెలరేగడం దురదృష్టకరం అన్నారు మాధవ్. అంబేద్కర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తి పేరుని ఒక జిల్లాకు పెట్టడం ద్వారా వచ్చే లాభం ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
Konaseema Tension : అమలాపురంలో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు
