Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.

Tension In Amalapuram : అమలాపురం అట్టుడుకుతోంది. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పేరును కోనసీమగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికుల చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. పోలీసులు, వారి వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సుకు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. మంత్రి క్యాంప్ కార్యాలయం మంటల్లో తగలబడింది. ఎమ్మెల్యే ఇంటిపైనా దాడికి తెగబడ్డారు. దుండగుల రాళ్ల దాడిలో ఎస్పీకి సైతం గాయాలయ్యాయి. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. సుమారు 10వేల మంది ఆందోళనకారులు అమలాపురాన్ని చుట్టుముట్టారు. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు కాలేజీ బస్సు తీసుకొచ్చారు. ఆ బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
కోససీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ జగన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ నిర్ణయమే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పేరు మార్చవద్దని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని టవర్ క్లాక్ సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లానే ముద్దు, వేరే పేరు వద్దు అంటూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ గన్ మెన్ గాయపడ్డారు. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్
- Agnipath scheme :‘అగ్నిపథ్‘స్కీమ్ కు వ్యతిరేకంగా కదంతొక్కిన యువత..మూడు రైళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
- Agnipath : ‘అగ్నిపథ్’స్కీమ్ పై భగ్గుమన్ననిరుద్యోగులు..నాలుగేళ్ల తరువాత మా పరిస్థితేంటీ?అంటూ ఆగ్రహం
- Konaseema : అమలాపురం అలర్ల ఘటనపై మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు..అజ్ఞాతంలో నిందితులు
- Taslima Nasreen : ‘మహ్మద్ ప్రవక్త జీవించి ఉంటే’..అంటూ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు
1పతనం అంచున ఉద్ధవ్ ఠాక్రే సర్కార్
2రాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక మంతనాలు
3మాజీ ఎమ్మెల్యే ఆమంచికి సీబీఐ నోటీసులు
4ఆపరేషన్ బంటి సక్సెస్
5Car Accident: టైరు పేలి ట్రక్కును ఢీకొన్న కారు… ఐదుగురు మృతి
6Fasting : గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉపవాసం!
7రైల్వే స్టేషన్ విధ్వంసంపై దర్యాప్తు ముమ్మరం
8Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
9Russian Journalist: యుక్రెయిన్ విద్యార్థుల కోసం రష్యన్ జర్నలిస్టు నోబెల్ ప్రైజ్ వేలం
10Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
-
Telugu Film Industry: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు
-
Beat Root : ఇన్ ఫెక్షన్ లకు వ్యతిరేకంగా పోరాడే బీట్ రూట్!
-
Potatoes : బంగాళ దుంపలు తింటే బరువు పెరుగుతారా?
-
Tumors : గర్భదారణకు అడ్డంకిగా గర్భసంచిలో గడ్డలు!
-
SALT : ఉప్పు మోతాదుకు మించితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయా?
-
Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!
-
Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
-
Vikram: చెన్నైలో విక్రమ్ నయా రికార్డ్!