Konaseema Tension : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు 

అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు.

Konaseema Tension : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు 

Amalapuram

konaseema : అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలంటూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఎస్పీ వాహనంపై గుర్తు  తెలియని వ్యక్తులు రాళ్ల దాడి జరిపారు. ఈ దాడిలో ఓ పోలిస్‌కు గాయాలయ్యాయి. పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం మొత్తం ఖాకీమయంగా మారింది. ఎక్కడికక్కడ యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. వినతి పత్రాలతో ర్యాలీగా అమలాపురం కలెక్టర్ కార్యాలయంకు వెళుతున్న యువకులను మొదట అడ్డుకున్నారు పోలీసులు. మరికొందరు యువకులు అమలాపురం బస్ స్టాండ్ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నారు. అమలాపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అనేక సంఘాల నుండి ప్రజల నుండి వచ్చిన డిమాండ్ మేరకు అంబేడ్కర్ జిల్లాగా పేరు పెట్టామని ఈరోజు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. అంబేడ్కర్ పేరు వద్దు అని ఏ పార్టీ అనలేదని కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయని… కొన్ని సపోర్టు చేశాయని ఆయన అన్నారు.

ప్రస్తుత ఆందోళన వెనుక ఏ శక్తులు వెనక ఉన్నాయో విచారణలో తెలుస్తాయని సజ్జల వ్యాఖ్యానించారు.  ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎవరు చేసినా ఉపెక్షించమని ఆయన హెచ్చరించారు.  అంబేడ్కర్ ఓ మహా మనిషి..అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి..ఆయనకి ఓ కులం అంటగట్టం మంచిది కాదని సజ్జల హితవు పలికారు,  అలాంటి వ్యక్తి పేరు పెట్టిన తరువాత తీసే ఆలోచన ఉండదని … అన్ని సమస్యలు సానుకూలంగా సర్దుకుంటాయని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు.

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై అమలాపురం భగ్గుమంది. జిల్లా పేరును కోనసీమ జిల్లా అనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలో జరిగిన భారీ ఆందోళన హింసాత్మకంగా మారింది. కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి అమలాపురం వీధుల్లో తిరిగారు. దళిత సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో కోనసీమ జిల్లా ను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. ఆందోళన కారులు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కార్యాలయాన్ని, ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

Also Read : Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి