Bjp Mp Subramanyaswamys Sensational Comments On Ttd
MP Subramanyaswamy’s sensational comments : తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడులోని సబానాయకర్ ఆలయం నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించామని తెలిపారు. సబానాయకర్ ఆలయం నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ఆలయాల నిర్వహణను ట్రస్టులే చూసుకునేటట్లుగా కృషి చేస్తామని చెప్పారు.
తిరుపతి విషయంలో హైకోర్టులో వేసిన కేసు పెండింగ్ లో ఉందన్నారు. తిరుపతిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూదన్నారు. టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. టీటీడీ నిధుల వినియోగంపై ప్రభుత్వంతో కాకుండా కాగ్ తో విచారణ జరిపించేందుకు జగన్ సర్కార్ అంగీకరించదని వెల్లడించారు. గత ఐదేళ్లల్లో టీటీడీ ఖర్చు పెట్టిన నిధులన్నింటినీ కాగ్ విచారణ జరపాలన్నారు. చంద్రబాబు హయాంలో అక్రమాలు వెలికితీయాలని చెప్పారు.
టీటీడీ ప్రతిష్టను భంగం కలిగించేలా వార్తను ప్రచురించారంటూ ఓ దినపత్రికపై తిరుపతి కోర్టులో టీటీడీ ఈవో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. టీటీడీ పవిత్రత దెబ్బతీసేలా ఓ పత్రిక, వెబ్ సైట్ లో కథనాలు..మతాల మధ్య చిచ్చు పెట్టేలా కథనం ఉందని రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు, క్రిమినల్ కేసులు దాఖలు అయ్యాయి. టీటీడీ తరపున ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేసు వాదించనున్నారు.
కాసేపట్లో సీఎం జగన్ ను సుబ్రహ్మణ్యస్వామి కలవనున్నారు. టీటీడీపై ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయి..వాటిపై రూ.100 కోట్ల దావా కేసుపై సీఎం జగన్ తో ఆయన చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడనున్నారు.