Black Fungus Cases : విశాఖ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ.. 94 కేసులు నమోదు

విశాఖ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌  విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 94 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెల్లడించింది.

Black Fungus Cases : విశాఖ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ.. 94 కేసులు నమోదు

Black Fungus Cases

Updated On : May 29, 2021 / 7:20 AM IST

94 Black Fungus Cases Found in Vizag : విశాఖ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌  విజృంభిస్తోంది.  ఒకవైపు కరోనా భయం వెంటాడుతుంటే.. మరోవైపు కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ భయం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే జిల్లావ్యాప్తంగా మొత్తం 94 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో వెల్లడించింది. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన బాధితులకు విశాఖ కేజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రిలో కూడా ఆరోగ్య శ్రీ కింద బెడ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు  వైద్యం అందించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

కరోనా చికిత్సకు ఆరోగ్య శ్రీ కింద 50శాతం బెడ్స్‌ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘింస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని వైద్యాధికారి హెచ్చరించారు.