Bride Death: జీలకర్రబెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురు హఠాన్మరణం

పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందిన ఘటన విశాఖలో గురువారం వెలుగు చూసింది

Visakha

Bride Death: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి..పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు..తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందిన ఘటన విశాఖలో గురువారం వెలుగు చూసింది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు.

Also read:Hostel Girls flees: హాస్టల్ నుంచి పరారైన నలుగురు విద్యార్థినిలు: ఇంకా లభ్యం కానీ ఆచూకీ

బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి కూతురు సృజన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే సృజన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read:Proddatur Crime: ఎస్సి మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారం: కేసు కూడా నమోదు చేయని ప్రొద్దుటూరు పోలీసులు?