Proddatur Crime: ఎస్సి మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారం: కేసు కూడా నమోదు చేయని ప్రొద్దుటూరు పోలీసులు?

 వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఎస్సీ మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Proddatur Crime: ఎస్సి మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారం: కేసు కూడా నమోదు చేయని ప్రొద్దుటూరు పోలీసులు?

Kadapa

Proddatur Crime: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఎస్సీ మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి చూసింది. స్థానికుల సమాచారం మేరకు..ప్రొద్దుటూరుకు చెందిన ఓ మైనర్ బాలిక..స్థానికంగా ఓ మసీదు వద్ద ఆశ్రయం పొందుతూ బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. బాలికకు తల్లి లేదు. తండ్రి ప్రొద్దుటూరులోనే మరొక ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మసీదు సమీపంలోని ఓ డెకరేషన్ దుకాణంలో పనిచేస్తున్న చెంబు అనే యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవ‌ల కూల‌దోసిన మార్కెట్ వ‌ద్ద‌ నుంచి బాలిక‌ను ఆటోలో తీసుకెళ్లి ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.

Also read:Chandrababu Naidu: ఏపీలో అరాచక పాలన: చంద్రబాబు

మే 4న బాలికను గమనించిన స్థానికులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలో గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్..బాలికతో ఏకాంతంగా మాట్లాడి అసలు వివరాలు రాబట్టారు. చెంబు అనే యువ‌కుడితో పాటు అత‌ని స్నేహితులు 10 మంది తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపిందని మహిళా కానిస్టేబుల్ పేర్కొంది. బాలిక చెప్పిన మాటలను వీడియో రికార్డు చేసిన ఎంఎస్‌కే యధాతధంగా ఆ వీడియోను వన్ టౌన్ పోలీసులకు అందించింది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా బాధితురాలిని మరొకచోటకి తరలించాలని వన్ టౌన్ పోలీసులు స్థానిక ఎంఎస్‌కేల‌కు ఆదేశించారని, బాధ్యులపై కేసు కూడా నమోదు చేయలేదని స్థానికులు పేర్కొన్నారు.

Also read:Bride refuses to marry: మద్యం తాగిన వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు

వన్ టౌన్ పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండు గర్భిణీ అయిన బాలిక ప్రస్తుతం మైలవరంలో ఓ ప్రైవేట్ స్వచ్చంద సంస్థలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన భాద్యులపై పోలీసు సిబ్బంది కేసులు కూడా నమోదు చేయకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు..ఘటనపై వివరణ కోరారు. బాలికపై అత్యాచార ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు డీఎస్పీ ప్రసాదరావు మీడియాకు తెలిపారు.