ఏపీలో దారుణ ఘటన.. భార్యాభర్తల మధ్య గొడవ.. కొడుకును చంపిన తండ్రి..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో తండ్రి తన సొంత కొడుకును..

ఏపీలో దారుణ ఘటన.. భార్యాభర్తల మధ్య గొడవ.. కొడుకును చంపిన తండ్రి..

Tragic Incident

Updated On : June 26, 2025 / 2:39 PM IST

Andhra Pradesh: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో తండ్రి తన సొంత కొడుకును చంపేశాడు. ఆ తరువాత అతను ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చంద్రశేఖర్, స్వరూప భార్యాభర్తలు. వారికి ఒక కుమారుడు సాత్విక్ ఉన్నాడు. స్వరూప రెండేళ్ల క్రితం జీవనోపాధికోసం ఖత్తార్ వెళ్లింది. ఇటీవలే ఖత్తార్ నుంచి సొంతూరుకు వచ్చింది. రెండు రోజుల క్రితం త్వరలో ఖత్తార్ వెళతానని భర్త చంద్రశేఖర్ కు స్వరూప చెప్పింది. అందుకు చంద్రశేఖర్ ఒప్పుకోలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో.. నువ్వు ఖత్తార్ వెళ్తే మన కొడుకు సాత్విక్‌ను చంపేస్తానని చంద్రశేఖర్ స్వరూపను బెదిరించాడు. బెదిరించినప్పటికీ.. స్వరూప ఖత్తార్ వెళ్లే ప్రయత్నాన్ని మానుకోకపోవడంతో భర్త చంద్రశేఖర్ దారుణానికి ఒడిగట్టాడు.

సాత్విక్ కు తాడు కట్టిస్తానని తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం వద్ద తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించాడు. ఆ తరువాత చంద్రశేఖర్ కూడా ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించాడు. స్వరూప ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం పోలీసులు భర్త చంద్రశేఖర్ పై మర్డర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్నారు.