AP SSC Result 2024 : ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.

AP SSC Result 2024 : ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

AP SSC Result 2024

AP 10th Result 2024 : ఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ 2023 -24 టెన్త్ ఫలితాలను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యూలర్ విద్యార్థులు 6,16,617 మందిలో 5,34,574 (86.69శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలురు 84.32శాతం, బాలికలు 89.17శాతం ఉత్తీర్ణ సాధించారని, ఈ ఏడాది బాలికలే అధిక సంఖలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. అదేవిధంగా 11,645 పాఠశాలల నుంచి పరీక్షలు రాశారు.. 2,803 పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని సురేష్ కుమార్ తెలిపారు.

అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లాల్లో ..
మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా.. చివరి స్థానంలో కర్నూల్ జిల్లా నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా 96.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. కర్నూల్ జిల్లాలో 62.47 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

సబ్జెక్టుల వారిగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం..
మొదటి లాంగ్వేజ్ 96.47శాతం
రెండో లాంగ్వేజ్ 99.24శాతం
మూడో లాంగ్వేజ్ 98.52 శాతం
మ్యాథమ్యాటిక్స్ 93.33శాతం
జనరల్ సైన్స్ 91.29శాతం
సోషల్ స్టడీస్ 95.34శాతం

మే 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు..
ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. రేపటి నుంచే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం రేపటి నుంచి ఆన్ లైన్ లోనే మాత్రమే అప్లికేషన్ తీసుకోవటం జరుగుతుంది.. అదికూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే అప్లికేషన్ చేసుకొనే అవకాశం ఉంటుందని సురేష్ కుమార్ తెలిపారు.

 

  • ఫలితాల కోసం https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేయండి.

ఈ ఏడాది మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు శారు. వీరిలో రెగ్యూలర్ విద్యార్థులు 6.16లక్షలు కాగా.. గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకు పైగా ఉన్నారు.