Garbage Currency notes : చెత్తకుండిలో నోట్లకట్టలు…
తాడేపల్లి మండలం స్థానిక ఉండవల్లి సెంటర్ ఎస్‌బీఐ సమీపంలో పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు కనిపించాయి.

Garbage Currency Notes
Bundles of Currency notes in the Garbage can : తాడేపల్లి మండలం స్థానిక ఉండవల్లి సెంటర్ ఎస్‌బీఐ సమీపంలో సోమవారం పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు కనిపించాయి. మొదట రూ.500 నోట్ల కట్ట కనబడగా, పంచాయతీ కార్మికులు దానిని తీసి దాచిపెట్టారు. చెత్త తీసేకొద్దీ కట్టలు కట్టలు బయటపడడంతో ఆందోళన చెందిన పంచాయతీ కార్మికులు సచివాలయం సిబ్బందికి సమాచారం అందించారు.
సచివాలయం సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, మొదట దొంగనోట్లు అనుకున్నారు. నోట్ల కట్టలన్నింటినీ పరిశీలించగా వాటిపై ‘చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’, ‘ఫర్ స్కూల్ జోన్ ఓన్లీ’ అని రాసి ఉండటంతో వారిలో వారు నవ్వుకొని దొరికిన ఆ కట్టలను తిరిగి చెత్తలో పడేసి డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. సుమారు 30 నోట్ల కట్టల వరకు ఉన్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు.