Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

Accident

Updated On : March 27, 2022 / 12:29 AM IST

Chittoor Bus Accident : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపు తప్పి లోయలో పడింది. సుమారు 50 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను అనంతపురం జిల్లా ధర్మవరం వాసులుగా గుర్తించారు. ధర్మవరం నుంచి తిరుపతికి బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ఉన్నారు. వీరంతా ఎంగేజ్ మెంట్ కోసం తిరుపతి వెళ్తున్నట్లు తెలిసింది.

గాయపడిన వారిని అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఘటనాస్థలిలో చీకటిగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. చిమ్మచీకట్లో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.