మతం ఆధారంగానే CAA తీసుకొచ్చారు : కేరళ సీఎం పినరయ విజయన్
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. సోమవారం (మార్చి 9, 202) అనంతపురంలో సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా వ్యతిరేకంగా బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతోందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ మూలాలపై ఆర్ఎస్ఎస్ దాడి చేస్తోందన్నారు.
రహస్యా ఎజెండాలో భాగమే సీఏఏ, ఎన్ ఆర్సీ అమలు చేస్తున్నారని తెలిపారు. మతం ఆధారంగానే సీఏఏ తీసుకొచ్చారని తెలిపారు. జనాభా లెక్కల సేకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఈ సభకు సీపీఐ నేత నారాయణ, ఎంపీ కేశినాని హాజరయ్యారు. సీఏఏ వ్యతిరేకించిన దేశంలో మొదటి రాష్ట్రం కేరళ.
సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఏఏకు వ్యతిరేకమని ప్రకటించారు. కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లతోపాటు మరికొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి.