E-Vehicles Charging Stations : ఏపీలో 400 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు
ఏపీలో కాలుష్య నివారణకోసం విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికి రుణసదుపాయం కల్పించింది.

Campaign Launched To Promote 400 Electric Vehicles Charging Stations In Andhra Pradesh
Electric Vehicles Charge Stations : ఏపీలో కాలుష్య నివారణకోసం విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికి రుణసదుపాయం కల్పించింది. ఎలక్ట్రికల్ వాహనాలు అందజేయాలన్న నిర్ణయానికి వచ్చింది సర్కారు.
ఆ దిశగా అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఈ- మొబిలిటీ వాహనాలపై బ్యూరో ఆప్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలసి ఏపీ ప్రభుత్వం గో- ఎలక్టిక్ ప్రచారాన్ని చేపట్టింది. విద్యుత్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశం. మరోవైపు ప్రభుత్వం మొదటిదశ క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 400 ఛార్జర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికి సంబంధించిన NTPC, ELలతో ఒప్పందం పూర్తయ్యింది. 2023నాటికి దేశవ్యాప్తంగా మూడు చక్రాల వాహనాలు, 2025 నాటికి ద్విచక్రవాహనాలను పూర్తిస్ధాయిలో వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది.
ఈ నేపధ్యంలో.. రాష్ట్రప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగం దిశగా అందరిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.