వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం : కాలువలోకి దూసుకెళ్లిన కారు…ఇద్దరి మృతి

శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 07:59 AM IST
వివాహానికి వెళ్లి వస్తుండగా విషాదం : కాలువలోకి దూసుకెళ్లిన కారు…ఇద్దరి మృతి

Updated On : January 31, 2020 / 7:59 AM IST

శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టాబ్యారేజీ ఎడమ కాలువలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒడిషాలో పర్లాఖిమిడిలో వివాహానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమారం ఇవ్వడంతో.. ఘటన చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో ఏరియా మేనేజర్లుగా పని చేస్తున్న పవన్ (32), బిందేటి చంద్రమోహన్ (45)తోపాటు మరో ముగ్గురు ఒడిషాలోని పర్లాఖిమిడి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా గురువారం (జనవరి 30, 202) అర్ధరాత్రి గొట్టబ్యారేజ్ వద్ద కారు అదుపు తప్పి ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో పవన్, చంద్రమోహన్ మృతి చెందారు.

మృతుల్లో పవన్ స్వస్థలం రాజమహేంద్రవరం కాగా, చంద్రమోహన్ స్వస్థలం ఖమ్మం. గాయాలైన వారు వెంకటగిరి ప్రసాద్, ఎం.మహేశ్వరరావు, ఎస్.దుర్గా నాగ ప్రవీణ్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలువలో 9 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నీటిని నిలుపుదల చేసి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు.