Perni Jayasudha: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కేసు

గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్ ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం దందాపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై కేసు నమోదైంది. బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌లో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటి రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని గోడౌన్ నిర్మించారు. సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు పేర్ని నాని. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్ ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో స్టాక్ లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు గుర్తించామని ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి తెలిపారు.

పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్లే షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు పేర్ని నాని భార్య జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.

Rahul Gandhi Video: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రోజా పువ్వు ఇచ్చి రాహుల్ గాంధీ నిరసన