Rahul Gandhi Video: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రోజా పువ్వు ఇచ్చి రాహుల్ గాంధీ నిరసన

పార్లమెంటు సమావేశాల్లో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంతో పాటు అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని ప్రతిపక్ష ఎంపీలు అధికార పక్ష సభ్యులను కోరారు.

Rahul Gandhi Video: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రోజా పువ్వు ఇచ్చి రాహుల్ గాంధీ నిరసన

Updated On : December 11, 2024 / 12:44 PM IST

పార్లమెంటు వద్ద కాంగ్రెస్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గులాబీ పువ్వు, మూడు రంగుల జెండాను ఇచ్చారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పార్లమెంటు సమావేశాల్లో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంతో పాటు అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

కాగా, 13వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమై అధికార, విపక్షాలు పాల్గొంటున్నాయి. అదానీ, మణిపూర్ అంశాలపై పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఉదయం నిరసన చేపట్టాయి విపక్షాలు. భారత వ్యతిరేక శక్తులతో సోనియా, రాహుల్ కలిసి పనిచేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలి: ఎంపీ రఘునందన్‌ రావు