CBAS Exams : సీబీఏఎస్ పరీక్షలు రద్దు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఏఎస్ పరీక్షలు రద్దు చేసింది.

CBAS Exams : సీబీఏఎస్ పరీక్షలు రద్దు

Cbas Exams

Updated On : August 3, 2021 / 12:54 PM IST

CBAS exams : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఏఎస్ పరీక్షలు రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషరనీని ఖరారు చేసేందుకు నిర్వహించే రెండు పరీక్షల్లో ఒకటైన సీబీఏఎస్ న రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ పేర్కొన్నారు.

సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షను తొలగించాలని కోరుతూ అజేయ కల్లంను కలిసినట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తిపై ఆయన స్పందించి సీఎం జగన్ ను సంప్రందించినట్లు చెప్పారు. పరీక్షను రద్దు చేసినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.