తిరుమల పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించిన అర్చకులు

ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

తిరుమల పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించిన అర్చకులు

TTD

Updated On : October 12, 2024 / 10:13 AM IST

తిరుమలలో కన్నుల పండువగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి. పుష్కరిణిలో అర్చకులు వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆలయంలో ఎనిమిది రోజులుగా మలయప్పస్వామికి వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు. శ్రీవారు పలు అవతారాల్లో దర్శనమిచ్చారు.

దసరా వేళ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గత రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్పస్వామి మాడవీధుల్లో అశ్వవాహనంపై విహరించారు. అశ్వవాహనంతో వేంకటేశ్వరుడి వాహన సేవలు ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 14 వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో చివరి ఘట్టమే నేడు నిర్వహించిన చక్రస్నానం.

రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు