Chandrababu Custody : చంద్రబాబు కస్టడీపై ముగిసిన వాదనలు.. రేపు ఉదయం 11.30గంటలకు తీర్పు, సర్వత్రా తీవ్ర ఉత్కంఠ

చంద్రబాబుని సీఐడీ కస్టడీకి ఇవ్వాలని, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని వాదించారు. Chandrababu Custody

Chandrababu CID Custody Petition

Chandrababu CID Custody : విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పు రేపటికి (సెప్టెంబర్ 21) వాయిదా వేసింది కోర్టు. రేపు ఉదయం 11.30గంటలకు తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హాట్ హాట్ గా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా, ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

చంద్రబాబుని సీఐడీ కస్టడీకి ఇవ్వాలని, అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయని వాదించారు. ఇక, చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు లేవని, అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతో జరిగిందన్నారు. కస్టడీ అవసరమే లేదని వాదించారు లూథ్రా. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Also Read..Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున లూథ్రా, ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద తమ వాదనలు వినిపించారు. చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకోవాలని, కస్టడీకి తీసుకుంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో చంద్రబాబుకి ఎవరు సాయం చేశారు? ఎంత మేరకు నిధులు దారిమళ్లాయి? ఇలాంటి అంశాలకు సంబంధించి మరికొన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు.

చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా సైతం గట్టిగానే వాదనలు వినిపించారు. చంద్రబాబుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రతోనే జరిగిందని, ఈ కేసులో అసలు కస్టడీ అనే మాటకు అర్థం లేదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పుని రేపటికి వాయిదా వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు దీనిపై ఆర్డర్ ఇస్తానని చెప్పారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనేది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

ట్రెండింగ్ వార్తలు