మోడీ..నీకు సిగ్గుందా : చంద్రబాబు

ఏపీకి ప్రత్యేకోహోదా ఇవ్వకుండా మోడీ నమ్మకం ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని విధాల మోసం చేశారని, కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావడానికి మోడీకి సిగ్గుందా అని ప్రశ్నించారు. ‘దేశానికి నేను ఏం చేశానో…మీరేం చేశారో చర్చకు సిద్ధంగా ఉండాలి’ అని మోడీకి చంద్రబాబు సవాల్ చేశారు. తునిలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
ఎలక్షన్ కమిషన్ ను కూడా మోడీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కోడి కత్తి పార్టీతో సహవాసం చేసి మమ్మల్ని అణగదొక్కాలనుకుటుంన్నారని మండిపడ్డారు. ఖబడ్దార్.. మీ వల్ల కాదని హెచ్చరించారు. ఐటీ, ఈడీ, సీబీఐకి భయపడబోమని తెలిపారు. ప్రజా బలం ఉంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మోడీతో పోరాడి అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ ఫ్యాక్టరీని తీసుకొచ్చానని తెలిపారు.
హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, సైబరాబాద్ ను తానే కట్టానని గుర్తు చేశారు. బంగారు గుడ్డుపెట్టే బాతు లాంటి హైదరాబాద్ ను వదిలి వచ్చామని తెలిపారు. ఇంకో బంగారు గుడ్డు పెట్టే బాతు అమరావతిని…హైదరాబాద్ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.