Chandrababu Naidu: సమగ్రమైన ప్రణాళికను రూపొందించాం: చంద్రబాబు
పార్టీకి కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర అని అన్నారు.

Chandrababu Naidu
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని అన్నారు. ఏపీలో జర్నలిస్టులపై ఉన్న కేసులన్నింటినీ ప్రత్యేక జీవో ద్వారా ఎత్తేస్తామని తెలిపారు.
కుప్పంలో జరిగిన గ్రానైట్ అక్రమాలపై దర్యాప్తు చేస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీకి కోటి సభ్యత్వ నమోదు జరగడం ఒక చరిత్ర అని అన్నారు. దేశంలో ఏ పార్టీకీ ఇలాంటి ఘనత లేదని తెలిపారు. గోదావరి-బనకచర్ల అనుసంధానం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.
కుప్పంలో స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేశానని చంద్రబాబు తెలిపారు. కుప్పం అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికను రూపొందించామని అన్నారు. జననాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా, యాప్ ద్వారా చెప్పుకోవచ్చని అన్నారు.
టెక్నాలజీ ద్వారా ప్రజలు, కార్యకర్తల సమస్యలను శరవేగంగా పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. భూ సమస్యలు గత వైసీపీ పాలనలో బాగా పెరిగాయిని చెప్పారు. కుప్పంలో జననాయకుడు కార్యక్రమం సక్సెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతామని అన్నారు. జననాయకుడులో వచ్చే ప్రతి అర్జీనీ ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తామని తెలిపారు. వారి పరిస్థితి బట్టి ఆర్దిక సహాయం చేస్తామని చెప్పారు.
KTR: ‘నేను చెబుతున్న విషయాన్ని రాసి పెట్టుకోండి’ అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్