Chandrababu Naidu: బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు, డీకే శివ కుమార్ ముచ్చట్లు

Chandrababu Naidu: అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్..

Chandrababu Naidu: బెంగళూరు విమానాశ్రయంలో చంద్రబాబు, డీకే శివ కుమార్ ముచ్చట్లు

DK shivakumar- Chandrababu Naidu

Updated On : December 28, 2023 / 8:22 PM IST

బెంగళూరు విమానాశ్రయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ పరస్పరం ఎదురుపడ్డారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు విమానాశ్రయంలో దిగారు.

అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్‌పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు. పరస్పరం ఎదురు కావడంతో చంద్రబాబు, డీకే శివకుమార్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు.

కాగా, ఏపీలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వరుసగా సభలు నిర్వహించడానికి ప్రణాళికలు వేసుకున్నారు. వచ్చే నెలలో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహించాల్సిన సభలపై రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.

Jani Master : నేను వైఎస్ జగన్ అభిమానిని.. పవన్ వీరాభిమాని జానీ మాస్టర్ కామెంట్స్..