Chandrababu Naidu: “చూడు.. వైఎస్ జగన్” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్

"ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?" అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోలతో ట్వీట్ చేశారు చంద్రబాబు.

Chandrababu Naidu

Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సెల్ఫీ చాలెంజ్ (#SelfieChallengeToJagan) విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద చంద్రబాబు నాయుడు సెల్ఫీలు దిగారు. “చూడు….జగన్.. ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు” అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అని అన్నారు.

“ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని.. నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?” అంటూ జగన్ కు ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోలతో ట్వీట్ చేశారు చంద్రబాబు. తన మైబైల్ ఫోన్ తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే క్యాడర్ కు, లీడర్స్ కు చంద్రబాబు నాయుడు సూచించారు.

#SelfieChallengeToJagan హ్యాష్ ట్యాగ్ తో ఇటీవల టీడీపీ నేత నారా లోకేశ్ కూడా సెల్ఫీలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కియా పరిశ్రమ ముందు నారా లోకేశ్ సెల్ఫీ దిగారు. చంద్రబాబు ఘనత అని సెల్ఫీలో కియా పరిశ్రమను చూపించారు. కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అని నిలదీశారు.టీడీపీ హయాంలో తెచ్చిన వందలాది పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి ఇప్పుడు చాలెంజ్ చేస్తున్నామని అన్నారు. తాను తెచ్చిన కనీసం ఒక్క పరిశ్రమ ముందైనా జగన్ సెల్ఫీ దిగి ఇలా చూపగలరా అని ప్రశ్నించారు.

Nara Lokesh : వైఎస్ జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసిరిన నారా లోకేశ్.. జగన్ ఎలా స్పందిస్తారో..

కాగా, చంద్రబాబు నాయుడు నెల్లూరుకి చేరుకున్నారు. ఎస్వీ జీఎస్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న జోన్ -4 సమీక్షా సమావేశoలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలు నియోజక వర్గాల నేతలు హాజరయ్యారు.

మరోవైపు, ప్రతి గంజాయి కేసులో వైసీపీ నేతల లింకులు దొరుకుతున్నాయంటూ #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ ను కూడా టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. “వైసీపీ నేతలు రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారు. యువత, విద్యార్ధులు గంజాయికి దూరంగా ఉండండి. మీ భవిష్యత్ ను, కుటుంబాలను కాపాడుకోండి” అంటూ #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ తో అచ్చెన్నాయుడు కూడా ట్వీట్ చేశారు.

TTD: సెలవుల వేళ టీటీడీలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ