TTD: సెలవుల వేళ టీటీడీలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ తాగునీరు, ఆహారం అందిస్తోంది. నిజపాద దర్శనాలను పునః ప్రారంభించాలని భక్తులు కోరారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

TTD: సెలవుల వేళ టీటీడీలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

TTD

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ తాగునీరు, ఆహారం అందిస్తోంది. నిజపాద దర్శనాలను పునః ప్రారంభించాలని భక్తులు కోరారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నిజపాద దర్శనం వల్ల స్వామివారికి నైవేద్యం ఆలస్యం అవుతుందని అన్నారు. సుదర్శనం, గోవర్ధన్, కల్యాణి సత్రాలల్లో పారిశుధ్యం బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. మూడు సత్రాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తామని చెప్పారు.

మార్చి నెలలో శ్రీవారిని 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. 8.25 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.29 కోట్లు అని తెలిపారు. మార్చి నెలలో విక్రయించిన లడ్డూల సంఖ్య 1.02 కోట్లుగా ఉందని అన్నారు.

Mekapati Rajamohan Reddy : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు