Chandrababu : అవినీతిపరులకు 17ఏ రక్షణ కవచం కాదు- సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ కీలక వాదనలు
అవినీతిపై దర్యాప్తు చేసి, దర్యాప్తు ఫలితాలను కోర్టుకు చూపించడానికి అధికారులకు తగినంత సమయం అందుబాటులో ఉండాలి. Chandrababu

Chandrababu Quash Petition Update (Photo : Google)
Chandrababu Quash Petition : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తన పేరుని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించనుంది. సెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ కీలకమైన వాదనలు వినిపించారు.
ముకుల్ రోహత్గీ వాదనలు..
”అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ చంద్రబాబుకి వర్తించదు. అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లతో కూడిన కేసులున్నాయి. సెక్షన్ 17 ఏ నిజాయితీపరులైన అధికారులను కాపాడటం కోసం ఉంది. అవినీతిపరులకు రక్షణ కల్పించేందుకు సెక్షన్ 17ఏ లేదు. చంద్రబాబుకి సెక్షన్ 17 ఏ వర్తించదు. 2015-16లో నేరం జరిగినప్పుడు అది ఉనికిలో లేదు.
ఐపీసీ నేరాలు కూడా ఉన్నాయి:
2018 జూన్ లో విచారణ ప్రారంభమైంది. అవినీతిని నిర్మూలించడం కోసం చట్టం ఉంది. అవినీతిపరులకు సెక్షన్ 17 ఏ రక్షణ కవచం కాదు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అనేక ఐపీసీ నేరాలు ఉన్నాయి. పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చిన 5 రోజులలోపు దాఖలు చేసిన రద్దు పిటిషన్ పూర్తిగా అసంబద్ధమైంది. క్వాష్ పిటిషన్ వల్ల స్కామ్‌పై దర్యాప్తు చేయడానికి పోలీసులకు సహేతుకమైన సమయం లేదు.
Also Read : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
అవినీతిపై దర్యాప్తు చేసి, దర్యాప్తు ఫలితాలను కోర్టుకు చూపించడానికి అధికారులకు తగినంత సమయం అందుబాటులో ఉండాలి. పీసీ యాక్ట్ ఐపీసీ కింద ఒక వ్యక్తి నిందితుడు అని అనుకుందాం. కొన్ని కారణాల వల్ల PC చట్టం కింద ఉన్న నేరాలు తొలగించబడినప్పటికీ, IPC కింద వాటిని విచారించడానికి ప్రత్యేక న్యాయమూర్తి సమర్థులుగా ఉంటారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ నేరాలు ఉంటే ప్రత్యేక కోర్టు అధికార పరిధిని కలిగి ఉంటుంది.
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్య కాదు:
చంద్రబాబు అరెస్ట్ వెనుక కక్ష సాధింపు చర్య లేదు. ప్రత్యేక కోర్టుకు పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ చట్టం కింద నేరాలు విచారించే అధికారం ఉంది. సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు. ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది.
ఇది తీవ్రమైన నేరం. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది.
Also Read : మోదీ, జగన్ కలిసే ఆ పని చేస్తున్నారు : అరుణ్ కుమార్
స్పెషల్ కోర్టులకు ఆ అధికారం ఉంది:
స్పెషల్ కోర్టులకు నాన్ పీసీ నేరాలు కూడా విచారించే అధికారం ఉందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద దాఖలైన ఈ కేసును డిస్మిస్ చేయాలి. నిహారిక జడ్జిమెంట్ కేసులో ఎఫ్ఐఆర్ లను యథాలాపంగా కొట్టి వేయకూడదని సుప్రీం తీర్పు ఇచ్చింది. 17A రెట్రాస్పెక్ట్ గా ఉండదు. 2018 జూలైకు ముందే స్కిల్ స్కాం జరిగింది. 17A పుట్టక ముందే నేరం జరిగింది. 13(సి)(డి) అమల్లో ఉన్నప్పుడే నేరం జరిగింది. దాని కింద కేసు నమోదు చేశారు.