Chandrababu Sensational Comments on changing name of NTR Health university in Unstoppable Episode
NTR : బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.
ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. ఇటీవల వివాదంగా మరీనా కొన్ని అంశాలపై కూడా మాట్లాడటం విశేషం. ఇటీవల ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసిన సంఘటన చాలా వివాదంగా మారింది. ఈ అంశాన్ని కూడా బాలకృష్ణ ప్రస్తావించారు
బాలకృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్, KBR పార్క్.. ఇలా కొన్నిటికి వేరే రాజకీయ నాయకుల పేర్లు పెట్టారు ఎందుకని అడగగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకి సేవ చేసిన రాజకీయ నాయకులని గుర్తించుకోవాలనే వాళ్ళ పేర్లు పెట్టాం. నాయకుల సేవని గుర్తించి పెట్టాం. కృష్ణకాంత్ పార్క్, KBR పార్క్, వాళ్లంతా తెలుగుదేశం కాకపోయినా వాళ్ళు ప్రజలకి సేవ చేశారు కాబట్టి పెట్టాము అని అన్నారు. దీంతో బాలకృష్ణ.. మా నాన్న ఏమి కంట్రిబ్యూట్ చేయలేదు కాబట్టి హెల్త్ యూనివర్సిటీ పేరు పీకేశారా అని సెటైరికల్ గా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అడిగారు.
దీనికి చంద్రబాబు సమాధానమిస్తూ.. ”అలా చేయడం చాలా పెద్ద తప్పు. అలాంటి గొప్ప నాయకులకి గౌరవం ఇవ్వాలి కానీ ఇలా ఉన్న గౌరవం తీయకూడదు. ఇలాంటివి రాజకీయాలకి పనికి రావు. గతంలో వైఎస్సార్ ఇలాగే చేశారు. హైదరాబాద్ కి నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చాను. ఇంటర్నేషనల్ కి తెలుగుదేశం కాకపోయినా రాజీవ్ గాంధీ పేరు పెట్టాను. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కి ఎన్టీఆర్ పేరు పెట్టాను. కానీ వైఎస్సార్ వచ్చాక మొత్తం రాజీవ్ గాంధీ అని మార్చేశారు. అప్పుడు కూడా ఫైట్ చేశాను.”
Chandrababu : హైదరాబాద్ అభివృద్ధిని నాకంటే ముందే ఎన్టీఆర్ గారు పసిగట్టారు..
”ఎన్టీఆర్ గారు సిద్దార్థ మెడికల్ కాలేజీని టేకోవర్ చేసి దాన్ని అభివృద్ధి చేసి మంచి యూనివర్సిటీ గా మార్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాను. కానీ ఇప్పుడు మార్చారు. పేరు పెట్టాలనుకుంటే ఏదన్నా డెవలప్ చేసి దానికి పెట్టుకోవాలి. కానీ ఇలా మార్చడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ పేరు తెలుగు వారి ఆత్మగౌరవం. ఆయన పేరు మారిస్తే తెలుగు జాతిని అవమానించినట్టే. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా, హార్టికల్చర్ యూనివర్సిటీలకి వైఎస్సార్ పేరు ఉంది. నేను మార్చాలనుకుంటే ఒక్క నిమిషం పని, కానీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను, మార్చలేదు. అది నా సంస్కారం. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తాను. అయినా మారకపోతే మళ్ళీ నేను సీఎం అవుతా అప్పుడు మారుస్తాను, తెలుగు వారి కోరిక తీరుస్తాను” అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ప్రస్తావించడంతో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి.