Chandrababu : హైదరాబాద్ అభివృద్ధిని నాకంటే ముందే ఎన్టీఆర్ గారు పసిగట్టారు..

చంద్రబాబు మాట్లాడుతూ.. ''హైదరాబాద్ కి 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు జూబ్లీహిల్స్ డెడ్ ఎండ్. ఆ తర్వాత మామగారు ఎన్టీఆర్ ఇప్పుడు మీరుండే ఇంటి ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఇల్లు కట్టిస్తాను అన్నారు. అప్పుడు నేను ఇక్కడ ఎవరు ఉంటారు..............

Chandrababu : హైదరాబాద్ అభివృద్ధిని నాకంటే ముందే ఎన్టీఆర్ గారు పసిగట్టారు..

Chandrababu says Hyderabad Development started with NTR

Updated On : October 14, 2022 / 4:33 PM IST

Chandrababu :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. రాళ్లు రప్పలుగా ఉన్న హైదరాబాద్ ని ముందుచూపుతో అభివృద్ధి చేశారు. అసలు హైదరాబాద్ ని ఇంతలా అభివృద్ధి చేయాలని ఎలా అనుకున్నారు అని అడిగారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ”హైదరాబాద్ కి 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు జూబ్లీహిల్స్ డెడ్ ఎండ్. ఆ తర్వాత మామగారు ఎన్టీఆర్ ఇప్పుడు మీరుండే ఇంటి ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఇల్లు కట్టిస్తాను అన్నారు. అప్పుడు నేను ఇక్కడ ఎవరు ఉంటారు సిటీకి దూరంగా వద్దులెండి అన్నాను. ఆ తర్వాత మీ కోసం ఆ ఇల్లు కట్టారు. తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో నేను ఓడిపోయాను. అప్పుడు నాకు ఇల్లు లేదు, మెహదీపట్నంలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాడిని. అప్పుడు ఎన్టీఆర్ గారు పిలిచి బాలకృష్ణ చెన్నైలో సినిమాలతో ఉన్నాడు. 3,4 ఏళ్ళు మీరు ఈ ఇంట్లో ఉండొచ్చు అని ఇప్పుడు మీరుండే ఇంటిని మాకిచ్చారు. అప్పుడికే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చాయి. అది నేను గమనించాను. ఎన్టీఆర్ గారు అది ముందే గమనించి ఇక్కడ ఇల్లు కట్టారు.”

Chandrababu : చంద్రబాబు ఎన్టీఆర్‌ని మొదటిసారి ఎప్పుడు కలిశారో తెలుసా?

”దాంతో నాకు అర్థమైంది హైదరాబాద్ డెవలప్ అవుతుందని, నా కంటే ముందే ఎన్టీఆర్ గారు ఆలోచించి ఇలా కట్టారు. హైదరాబాద్ డెవలప్ చేయడానికి ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి. అప్పుడే IT ఎదుగుతుందని అర్థమైంది. దాని గురించి ఆలోచించి, అధ్యయనం చేశా. టెలిఫోన్, కంప్యూటర్లు కూడు పెడతాయా అని నన్ను ఎగతాళి చేసారు. కానీ ఇప్పుడు ఎలా ఉందో అందరం చూస్తున్నాం. అందుకే అప్పుడే హైదరాబాద్ లో డెవలప్ మీద కాన్సంట్రేట్ చేశాను” అని తెలిపారు.