Chandrababu : చంద్రబాబు ఎన్టీఆర్‌ని మొదటిసారి ఎప్పుడు కలిశారో తెలుసా?
మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. షోలో ఎన్టీఆర్ ని ఎప్పుడు మొదటిసారి కలిశారు అని బాలకృష్ణ అడిగారు............

Chandrababu and NTR first Meeting
Chandrababu : బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో భారీగా హిట్ అయింది. పలు రికార్డులని కూడా క్రియేట్ చేసింది. ఈ షోలో బాలయ్య బాబు సరికొత్తగా కనపడటంతో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.
ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. షోలో ఎన్టీఆర్ ని ఎప్పుడు మొదటిసారి కలిశారు అని బాలకృష్ణ అడిగారు.
Unstoppable 2 : గ్రాండ్ ఎంట్రీతో అన్‌స్టాపబుల్ మొదలు.. అదరగొట్టిన బాలయ్య
చంద్రబాబు దీనికి సమాధానమిస్తూ.. అప్పుడు అంజయ్య గారి క్యాబినెట్ లో నేను ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిష్టర్ గా ఉన్నాను. ప్రభుత్వ పని మీద ఓ సారి ఎన్టీఆర్ ని కలవాల్సి వచ్చింది. రామకృష్ణ స్టూడియోలో అనురాగ దేవత షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ గారు అక్కడికి రమ్మన్నారు. మొదటిసారి ఆ సినిమా షూటింగ్ లో కలిశాము. దాదాపు గంటసేపు మాట్లాడాను ఆరోజు ఎన్టీఆర్ గారితో అని తెలిపారు.