భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవో పేపర్లను చించేసిన చంద్రబాబు

భోగి మంటల్లో రైతు వ్యతిరేక జీవో పేపర్లను చించేసిన చంద్రబాబు

Updated On : January 13, 2021 / 9:30 AM IST

Chandrababu tore up anti-farmer govt go papers in bhogi fires : కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు భోగి పండుగలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 5 జీవోలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ సొమ్ముని రైతులకు అందకుండా చేసిన జీవోతో పాటు, కౌలురైతులకు అన్యాయం చేస్తూ తెచ్చిన జీవోలను భోగి మంటల్లో చించి తగలబెట్టారు.

ప్రకృతి వ్యవసాయానికి అందాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ ఇచ్చిన జీవో, సున్నా వడ్డీ కుదింపు జీవో, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తూ తీసుకొచ్చిన ప్రతులను భోగిమంటల్లో వేశారు. పరిటాల గ్రామంలో జరిగిన భోగి వేడులకలో టీడీపీ సీనియర్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చంద్రబాబు రాకతో పరిటాల గ్రామంలో సందడి కార్యక్రమం నెలకొంది. అంతకు ముందు భోగి కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.