Chandrababu : మిగ్‌జాగ్ తుపాను బాధిత రైతులకు చంద్రబాబు పరామర్శ .. జిల్లాల్లో పర్యటన

chandrababu Visit migjaum cyclone affected areas : మిగ్ జాగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు.తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారికి దైర్యం చెబుతున్నారు.
తెనాలి, వేమూరు, బాపట్ల నియోజక వర్గాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిసీలించి రైతులను కలిసి పరామర్శిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గo రేవేంద్రపాడు రైతుల్ని పరామర్శించారు. రైతుల కష్టాలు గురించి తెలుసుకున్నారు. ప్రజలకు ఇక కష్టాలు ఇక మూడు నెలలే ఉంటాయని..అందరు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈరోజు తాను పర్యటనకు వస్తున్నానని హడావుడి గా జగన్ బయలుదేరారు అంటూ విమర్శించారు. ఈ సమయంలో పొలాల్లో ఉండి రైతు కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారు ? అని ప్రశ్నించారు. తానుపంట నష్ట పరిహారం పెంచుకుంటూ వెళ్తే…జగన్ తగ్గించుకుంటూ వచ్చారని విమర్శించారు.కనీసం పంట భీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటూ మండిపడ్డారు. రైతులంతా ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు తెనాలిలోని నందివెలుగు నుంచి ప్రారంభించి అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో సాగనుంది. రాత్రికి బాపట్లలోనే బసచేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
కాగా..బెయిల్ పై జైలు నుంచి విడుదల అయిన తరువాత చంద్రబాబు తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇటీవల మిగ్ జాగ్ తుపాను ఏపీని అతలాకుతలం చేసింది.తుపాన్ ధాటికి పలు జిల్లాల్లో పంటు నీటమునిగిపోయింది. రైతన్నలపై విరుచుపడిన మిగ్‌జాగ్వే చేతికందిన పంటను నీటిపాలు చేసింది. వేలాది ఎకరాల్లో పంటలను నీటి మనిగిపోయాయి. తీవ్రంగా నష్టపోయిన రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంట నీటమునిగి ఎందుకు పనికిరాకుండా పోవటంతో అల్లాడిపోతున్నారు. మరోపక్క ఈ తుపాను తీవ్రతకు ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.