Chennakesava Reddy: జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి నాయకుడు అవుతారు: ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

Chennakesava Reddy: జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chennakesava Reddy: జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి నాయకుడు అవుతారు: ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

Chennakesava Reddy

Updated On : April 27, 2023 / 8:54 PM IST

Chennakesava Reddy: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పారు. చంద్రబాబు తర్వాత టీడీపీ ఉండదని అన్నారు. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి నాయకుడు అవుతారని చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారని అన్నారు.

నారా లోకేశ్ ఎన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేరని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ క్యాడరు, ప్రజలు నారా లోకేశ్ ను వద్దనుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పని, చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని అన్నారు. లోకేశ్ ఇంకా పది పాదయాత్రలు చేసిన నాయకుడు కాలేరని చెప్పారు.

సీఎంగా జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉంటారని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పనులు జరగలేదని చెప్పారు. ఆర్డీఎస్ కుడి కాలువ విషయంలో ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. ఆర్డీఎష్ సక్సెస్ కాదని అన్నారు. కుడి కాలువ నీళ్లను నందవరం రైతుల కిందకు రానిస్తారా? అని ప్రశ్నించారు. అధికారులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని అర్జీ ఇచ్చానని తెలిపారు.

KA Paul: కేసీఆర్ మరోసారి సీఎం అవరు: విజయవాడలో కేఏ పాల్