Chief engineer dead body of Korean ship that arrived at Kakinada port
Kakinada port : కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన కొరియా నౌకలో మృతదేహం కలకలం రేపింది. క్రూడాయిల్ తో కొరియా నుంచి కాకినాడ సముద్ర తీరానికి వచ్చిన నౌకలో ఓమృతదేహం పడి ఉంది.నౌక క్యాబిన్ పడి ఉన్న ఆ మృతదేహం చీఫ్ ఇంజనీర్ లీ ఓజిన్ గా గుర్తించారు. క్రూడాయిల్ తీసుకుని కేఎస్పీఎల్ కు వచ్చిన కొరియా నౌకలో చీఫ్ ఇంజనీర్ లీ ఓజిన్ చనిపోయి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించగా పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.